బిఫోర్ ఫేస్‌ మాస్క్‌

Durga
ఫేస్‌మాస్క్‌ వేసుకోవడానికి ముందు చెయ్యాల్సిన పనులేమిటో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఫేస్‌ని చన్నీళ్లతో వాష్‌ చేసుకోవాలి. ఫేస్‌ తడిగా లేనప్పుడు, అంటే డ్రైగా ఉంటే విటమిన్‌ ‘ఇ’ తో ఫేస్‌ని మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత సోప్‌తో వాష్‌ చేసుకోండి. మామూలుగా మళ్లీ ఫేస్‌వాష్‌ చేసుకోండి. టవల్‌ను ఉపయోగించకుండా దానికై అదే ఆరేవరకూ ఓపిక పట్టండి.  పై పద్ధతుల ద్వారా ఎలాంటి మాస్క్‌ ప్యాక్‌ వేసుకోకుండానే ఫేస్‌ నీట్‌నెస్‌ కోసం అలా చేయొచ్చు. ఫేషియల్‌కి ఉపయోగించే పదార్థాలు బేసెస్‌: మట్టి లేదా జెల్‌లు బేస్‌లుగా చేసి ఉపయోగిస్తారు. లోతుగా శుభ్రం చేయడానికి ఈ క్లేలు వాడతారు. ఈ జెల్‌లు సాధారణంగా సున్నితచర్మం గలవారికి బాగా సూట్‌ అవ్ఞతాయి. గ్రీన్‌ క్లే: సున్నిత చర్మం గలవారు వాడకూడదు. మిగతా ఎవరైనా వాడొచ్చు.  ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీసెప్టిక్‌గా పని చేస్తుంది. చర్మరంధ్రాలను శుభ్రపరచి రక్తనాళాల్లో రక్తప్రసరణ ఉత్తేజపరుస్తుంది. క్లేలు: పుల్లర్స్‌ ఎర్త్‌ క్లేలు నార్మల్‌ స్కిన్‌, ఆయిలీ స్కిన్‌ గలవారికి సూట్‌ అవ్ఞతాయి. చర్మరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. కయోనిన్‌: చర్మ విషపదార్థాలు తొలగించి రక్తప్రసరణకు ఉపకరిస్తుంది.   ఫేషియల్‌ మాస్క్‌లో వాడే ఆవశ్యక నూనెలు :   సాధారణ పొడి చర్మం గలవారికి, తులసి, చందనం, చామంతి. నార్మల్‌ ఆయిలీ చర్మానికి తులసీ, జునిపర్‌, సున్నిత చర్మం గలవారికి చేమంతి రోజ్‌. ప్యూరీలు,  ఫ్రూట్‌ ప్యూరీలలో స్ట్రాబెర్రీ, ఆల్ఫా హైడ్రాక్సిన్‌గా పనిచేస్తుంది. కుకుంబర్‌ ప్యూరీ చర్మాన్ని శాంతపరచి చల్లబరుస్తుంది. పెరుగు చర్మాన్ని బాగా కూల్‌చేసి మృదువుగా చేస్తుంది. పాలు మృతకణాలను తొలగించి చర్మానికి మృదు త్వాన్ని ఇస్తుంది. తేనె యాంటీ బ్యాక్టీరియల్‌గా వర్క్‌ చేస్తుంది. స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: చక్కటి సుగంధ సువాసన కోసం గులాబిరేకులు, నిమ్మపండు రసం యాంటీ బ్యాక్టీరియల్‌గా ఉండటం కోసం, నీమ్‌ పౌడర్‌ ఇంకా ఓట్‌మీల్‌ మృదుత్వం కోసం... మరి మీ ఫేషియల్‌లో ఇవన్నీ ఉన్నాయో లేదో తెలుసుకోండి మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: